టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) త్వరలోనే రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈయన గుంటూరు కారం( Gunturu kaaram ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలవుతుంది.ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాతో మహేష్ బాబు బిజీ కాబోతున్నారు.
ఇక రాజమౌళి మహేష్ బాబు తాజాగా సందీప్ రెడ్డి( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి యానిమల్ ( Animal ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే యానిమల్ సినిమాలో ముందుగా నటించే అవకాశం మహేష్ బాబుకి వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా గురించి ఈ వేడుకలు వీరిద్దరూ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడారు.వీరి వ్యాఖ్యలతో సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెరిగాయి.
మహేష్ బాబు అయితే ఏకంగా ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు మెంటల్ ఎక్కిందని ట్రైలర్ చూస్తూ ఫోన్ కూడా కింద పడేసుకున్నాను అంటూ కామెంట్ చేశారు.
ఇలా ఈ సినిమా గురించి మహేష్ బాబు ఇలాంటి కామెంట్ చేయడంతో రాజమౌళి మహేష్ బాబుతో మాట్లాడుతూ.నువ్వు ఎందుకు ఇంత మంచి సినిమాని వదిలేసావు? నటుడు ఎప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలి.అప్పుడే ఆడియన్స్ ని అభిమానుల్ని ఇంకా పెంచుకుంటాడని రాజమౌళి.
మహేష్ మొహం మీదే చెప్పారట.ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఇంత మంచి సినిమా సినిమా వదులుకొని తప్పు చేశారా అంటూ భాద పడుతున్నారు.