మహేష్‌ను పూర్తిగా వాడేస్తానంటోన్న జక్కన్న  

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - Rajamouli To Show Mahesh Babu In All Shades

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి తన నెక్ట్స్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబును మునుపెన్నడూ చూడని విధంగా జక్కన్న చూపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - మహేష్‌ను పూర్తిగా వాడేస్తానంటోన్న జక్కన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మహేష్‌ను పూర్తి మాస్ హీరోగా ఏ ఒక్క దర్శకుడు కూడా మనకు ఇప్పటివరకు చూపెట్టలేదు.దీంతో మాస్ హీరోలకు తనదైన స్టైల్‌లో స్టార్‌డమ్ తీసుకొచ్చే జక్కన్న, మహేష్‌తో ఎలాంటి మాస్ అవతారం ఎత్తిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక మహేష్‌లోని అన్ని యాంగిల్స్‌ను జక్కన్న తన సినిమాలో చూపించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

మహేష్ కోసం ఇప్పటినుండే ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నాడని, ఈ సినిమాతో మహేష్‌ను మరో లెవెల్‌లో చూపిస్తాడనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అయితే ప్రస్తుతం మహేష్ తన కొత్త చిత్రం సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే పనిలో పడ్డాడని, ఈ సినిమా పూర్తయ్యాక జక్కన్నతో సినిమా ప్రారంభిస్తారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పూర్తి ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

మరి జక్కన్న మహేష్ బాబును ఎలా వాడుకుంటాడో తెలియాలంటే ఈ కాంబోలో రాబోయే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

#Mahesh Babu #SarkaruVaari #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు