న్యూ ఇయర్‌కు రాజమౌళి గిఫ్ట్.. ఏమిటో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ కోసం కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌తో సహా ఇతర ఇండస్ట్రీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు.

 Rajamouli To Give New Year Gift From Rrr-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ గిఫ్ట్‌ను రాజమౌళి జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్, చరణ్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను ఆ రోజు రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట.

ఇద్దరు హీరోల లుక్‌లను ఒకే పోస్టర్‌పై రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారట.

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా వదులుతారా లేక నిరాశ పరుస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube