ఒక్క దెబ్బకు ఆర్ఆర్ఆర్ ఖతం అంటోన్న జక్కన్న  

Rajamouli To Complete Rrr In One Schedule - Telugu Ajay Devgan, Ntr, Rajamouli, Ram Charan, Rrr

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు.

 Rajamouli To Complete Rrr In One Schedule

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవ్వగా, కరోనా వైరస్ ప్రభావం వల్ల నెలకొన్న లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు.

కాగా సినిమా మరింత ఆలస్యం అవుతుందని, రిలీజ్‌ను సంక్రాంతి బరి నుండి తప్పించినట్లు చిత్ర నిర్మాత డివివి దానయ్య కూడా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తి కాదని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఒక్క దెబ్బకు ఆర్ఆర్ఆర్ ఖతం అంటోన్న జక్కన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఈ సినిమాను ఏదేమైనా అనుకున్న సమయానికే పూర్తి చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తానని రాజమౌళి ధీమాగా చెబుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని, మిగతా 20 శాతం ఒకేఒక్క షెడ్యూల్‌లో పూర్తి చేస్తానని రాజమౌళి కాన్ఫిడెంట్‌గా అంటున్నాడు.

మొత్తానికి రాజమౌళి కాన్ఫిడెన్స్ చూస్తే, ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడని అర్ధమవుతోంది.మరి ఒక్క షెడ్యూల్‌లో మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయడం అయ్యే పనేనా అని అందరూ ఆలోచిస్తున్నారు.

ఒకవేళ రాజమౌళి చెప్పిన విధంగా ఒక్క షెడ్యూల్‌లోనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తే అది ఖచ్చితంగా రికార్డే అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli To Complete Rrr In One Schedule Related Telugu News,Photos/Pics,Images..

footer-test