కేసీఆర్‌కు జక్కన్న ధన్యవాదాలు  

Rajamouli Thanks Kcr - Telugu Chiranjeevi, Kcr, Rajamouli, Tollywood News

కరోనా కారణంగా సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా స్తంభించి పోవడంతో సినీ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.దీంతో పలువురు సినీ ప్రముఖులు నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమై తమ సమస్యలను తెలియజేశారు.

 Rajamouli Thanks Kcr

ఈ క్రమంలో కేసీఆర్ సినిమాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేయడమే కాకుండా షూటింగ్‌లు జరుపుకునేందుకు అంగీకరించారు.దీంతో సినిమా రంగానికి చెందిన వారందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఈ జాబితాలో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కూడా కేసీఆర్‌కు తన ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన చిత్ర రంగాన్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అని అన్నారు.

కేసీఆర్‌కు జక్కన్న ధన్యవాదాలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ చూపిన చొరువ చాలా అభినందనీయమని ఆయన అన్నారు.తాను తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, ఇలా లాక్‌డౌన్ కారణంగా అన్నీ కార్యక్రమాలు నిలిచిపోయాయని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకునేందుకు రెడీ అవుతున్నట్లు ఆయన తెలిపారు.

సినీ రంగానికి చెందిన తమ సమస్యలను కేసీఆర్ చాలా ఓపికగా విన్నారని, ఆయన తమపట్ల చూపిన అభిమానానికి సినీ రంగం తరఫున కృతజ్ఞతలు తెలిపాడు.కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి.

ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న అండ్ టీమ్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Thanks Kcr Related Telugu News,Photos/Pics,Images..