ఎన్టీఆర్‌ లుక్‌ కథలో భాగం.. సినిమా చూస్తే వాళ్లు నోర్లు మూస్తారు  

Rajamouli team about RRR NTR muslim look controversy , Rajamouli, RRR Movie, NTR Muslim Look, Komaram Bheem Teaser, Adivasis - Telugu Ntr Look, Rajamouli, Ram Charan Look, Rrr, Rrr Ntr And Ramcharan, Telugu Film News

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో కనిపించబోతున్నారు.అయితే ఈ పాత్రలతో జక్కన్న మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

TeluguStop.com - Rajamouli Team About Rrr Ntr Muslim Look Controversy

పూర్తిగా కల్పిత కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు గతంలోనే ప్రకటించాడు.అయినా కూడా తాజాగా ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ వీడియో విడుదల తర్వాత గిరిజన జాతికి చెందిన కొందరు ఎన్టీఆర్‌ ను కొమురం భీమ్‌ అంటూ ఆ ముస్లీం క్యాప్‌ ఏంటీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏకంగా ఒక గిరిజన ఎంపీ దర్శకుడు రాజమౌళిని హెచ్చరించాడు. కొమురం భీమ్‌ చరిత్రను వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

TeluguStop.com - ఎన్టీఆర్‌ లుక్‌ కథలో భాగం.. సినిమా చూస్తే వాళ్లు నోర్లు మూస్తారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చరిత్రను తప్పుగా చూపిస్తే సినిమా ఆడే థియేటర్లు తగలబడి పోతాయి అంటూ ఆయన హెచ్చరించారు.దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా స్పందించింది.

సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు కొమురం భీమ్‌ అనే పేరు పెట్టాం.అంతే తప్ప కొమురం భీమ్‌కు ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ పాత్రకు ఎలాంటి సంబంధం లేదు.సినిమా కథలో భాగంగా ఎన్టీఆర్‌ ముస్లీం వేశంలో కనిపించాల్సి వస్తుంది.సినిమా చూస్తే అది అర్థం అవుతుంది.

ఆ సమయంలో కొమురం భీమ్‌ పాత్ర గొప్పతనం అందరికి అర్థం అవుతుంది.సినిమా విడుదల అయ్యే వరకు వారు గొడవ చేస్తూనే ఉంటారు.

కనుక ఇప్పుడు తాము ఏమీ అధికారికంగా ప్రకటన చేయబోవడం లేదు అన్నారు.సినిమా చూసిన తర్వాత వారే నోరు మూసుకుంటారు.

తాము ఎక్కడ కూడా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం లేదు.అసలు తాము తీసే సినిమాకు చరిత్రకు సంబంధం లేదు అన్నట్లుగా రాజమౌళి సన్నిహితుల వద్ద అంటున్నాడు.

ఏది ఏమైనా ఈ వివాదం వల్ల సినిమాపై అంచనాలు ఆసక్తి మరింతగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

#Ram Charan Look #RRRNtr #Rajamouli #NTR Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Team About Rrr Ntr Muslim Look Controversy Related Telugu News,Photos/Pics,Images..