ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి!  

ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ స్టార్ట్ చేసిన కీరవాణి, రాజమౌళి, మరో వైపు షూటింగ్. .

Rajamouli Started Music Sitting For Rrr Movie-dvv Danayya,jr Ntr,kiravani,ram Charan,rrr Movie,started Music Sitting,tollywood

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతుంది. రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ లో జక్కన్న చేస్తున్నట్లు తెలుస్తుంది...

ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి!-Rajamouli Started Music Sitting For RRR Movie

ఇదిలా వుంటే ఫాస్ట్, ప్రెజెంట్ కలయికలో యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగి కమర్షియల్ మూవీగా ఉండబోతుంది అని తెలుస్తుంది. అలాగే ఇందులో రామ్ చరణ్, తారక్ దొంగ పోలీస్ పాత్రలలో కనిపించబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇదిలా వుంటే ఈ సినిమాకి జక్కన్న ఫ్యామిలీ నుంచి విజయేంద్ర వర్మ కథ అందిస్తూ వుండగా, కీరవాణి సంగీతం సమకూర్చుతున్నాడు.

ఇప్పటి వరకు షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న జక్కన్న తాజాగా ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా బట్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.