ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న స్పెషల్ ప్లాన్  

Rajamouli Special Plans For Rrr Promotions - Telugu Danayya, Ntr, Promotions, Rajamouli, Ram Charan, Rrr

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా వారు తప్పకుండా ఫాలో అవుతున్నారు.

Rajamouli Special Plans For Rrr Promotions - Telugu Danayya Ntr Ram Charan Rrr

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇదిగో అదుగో అంటూ చిత్ర యూనిట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ వస్తోంది.కాగా ఈ సినిమాను జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ విషయంలో చిత్ర దర్శకుడు రాజమౌళి తనదైన ప్లానింగ్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలోని హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ విషయంలో జక్కన్న చాలా ముందుచూపుతో వెళ్తున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.

హీరోల ఫస్ట్ లుక్ రిలీజ్ విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కే విధంగా ప్లాన్ చేస్తున్నాడట.అటు సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ కూడా చాలా విభిన్నంగా ఉండనున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

తాజా వార్తలు

Rajamouli Special Plans For Rrr Promotions-ntr,promotions,rajamouli,ram Charan,rrr Related....