జక్కన్న కొడుకు సినిమా ఏమైంది?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దర్శకత్వంపై ఆసక్తి లేదన్న అతడు సినిమా రంగంలోని అనేక విభాగాలను టచ్‌ చేస్తూ ఉంటాడు.

 Rajamouli Son Kartikeya Movie Update-TeluguStop.com

ముఖ్యంగా అతడికి నిర్మాణం అంటే చాలా అభిమానం.అందుకే సినిమాల నిర్మాణం వైపుకు మరలబోతున్నట్లుగా ప్రకటించాడు.

అంతే కాకుండా ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.అంతా కొత్త వారితో ప్రారంభం అయిన ఆకాశవాణి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

జక్కన్న కొడుకు సినిమా ఏమైంది?

దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి.అయితే సినిమా మాత్రం కదలకుండా మెదలకుండా ఉండి పోయింది.అసలు సినిమా షూటింగ్‌ జరుగుతుందా అనే అనుమానాలు ఇప్పుడు మొదలు అయ్యాయి.సినిమా నిర్మాణం ఆగిపోయిందనే పుకార్లు సినీ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో కార్తికేయ సినిమా గురించి స్పందించాల్సిందే అంటూ అభిమానులు కోరుకుంటున్నాడు.

జక్కన్న కొడుకు సినిమా ఏమైంది?

జక్కన్న కారణంగా ‘ఆకాశవాణి’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.ఆ అంచనాలను అందుకోవడం కష్టం అని, పరువు తీసే పనులు చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను ఆపేశారనే టాక్‌ కూడా వస్తుంది.ఈ చిత్రంకు నిర్మాతగా కార్తికేయ వ్యవహరిస్తుంటే కీరవాణి తనయుడు సంగీతాన్ని అందిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

పలువురు వారసులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారన్నారు.కాని సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే దారి కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube