తారక్ హీరో చరణ్ ఫాలోవర్ అనుకోవచ్చు కదా.. వైరల్ అవుతున్న జక్కన్న షాకింగ్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత చరణ్, తారక్ అభిమానుల మధ్య ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరిగిందనే సంగతి తెలిసిందే.చరణ్ సినిమాలో ఎక్కువ సీన్లలో కనిపించారని చరణ్ అభిమానులు చెబితే తారక్ కు అద్భుతమైన సీన్లు దక్కాయని తారక్ అభిమానులు కామెంట్లు చేశారు.

 Rajamouli Shocking Comments About Junior Ntr Domination Details, Director Rajamo-TeluguStop.com

అయితే సినిమాలో చరణ్ డామినేట్ చేశాడని కామెంట్లు చేసేవాళ్లకు రాజమౌళి తనదైన శైలిలో జవాబిచ్చారు.

సినిమాలో చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉందని చెప్పడం సరికాదని ఆయన అన్నారు.

ఆర్ఆర్ఆర్ లో తారక్ చరణ్ ను రెండుసార్లు రక్షించాడని చరణ్ మాత్రం తారక్ ను ఒకసారి మాత్రమే రక్షించాడని రాజమౌళి వెల్లడించారు.సినిమాలోని ఒక సన్నివేశంలో చరణ్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా క్లారిటీ లేని తన లక్ష్యానికి తారక్ దారి చూపించాడని చెబుతాడని రాజమౌళి కామెంట్లు చేశారు.

ఆయుధం మాత్రమే ధైర్యం అని భావించిన తనకు తారక్ ఎమోషన్ ను కూడా ఆయుధంగా చూపించాడని చరణ్ చెప్పాడని జక్కన్న గుర్తు చేశారు.

Telugu Charan Follower, Rajamouli, Ntr, Kgf Chapter, Ram Charan, Ramcharan, Rrr,

ఈ విధంగా చూస్తే తారక్ హీరో చరణ్ ఫాలోవర్ అని అనుకోవచ్చని రాజమౌళి వెల్లడించారు.సినిమాను ఇలా చూసేవాళ్లకు తారక్ డామినేషన్ కనిపిస్తుందని జక్కన్న పేర్కొన్నారు.జక్కన్న చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Charan Follower, Rajamouli, Ntr, Kgf Chapter, Ram Charan, Ramcharan, Rrr,

మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కాగా ఈ సినిమాకు 1,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.కేజీఎఫ్2 రిజల్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రభావం చూపనుంది.కేజీఎఫ్2 సినిమా కూడా అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాజమౌళి కామెంట్లపై చరణ్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube