ఒక్క సెట్ కోసం రూ.20 కోట్లు.. జక్కన్నతో మామూలుగా ఉండదు!  

Rajamouli Set In Gandipet Of Rs 20 Cr For Rrr - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ram Charan, Rrr

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rajamouli Set In Gandipet Of Rs 20 Cr For Rrr

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను ఫిక్షనల్ మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న.

అయితే ఈ సినిమాలో ఓ కీలక ఘట్టానికి సంబంధించి ఓ భారీ సెట్‌ను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని గండీపేట్‌లో నిర్మించింది.ఈ సెట్ కోసం ఏకంగా రూ.20 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు చిత్ర యూనిట్.కాగా ఈ సెట్స్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కించనుంది.

ఒక్క సెట్ కోసం రూ.20 కోట్లు.. జక్కన్నతో మామూలుగా ఉండదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా షూటింగ్ వాయిదా పడటంతో, ఇప్పుడు షూటింగ్‌ను జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఈ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉండనున్నాయి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అందాల భామ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Set In Gandipet Of Rs 20 Cr For Rrr Related Telugu News,Photos/Pics,Images..

footer-test