రాజమౌళి సెంటిమెంట్‌ దెబ్బ మళ్లీ ప్రభాస్‌కు గట్టిగా పడిందే  

Rajamouli Sentiment Repeat In Prabhas Sahoo Movie-bhaubali,charan,chatrapathi,magadheera,prabhas Sahoo,rajamouli,vikramarkudu

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘సాహో’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాహుబలి వంటి భారీ చిత్రం తర్వాత ఏమాత్రం తగ్గొద్దనే ఉద్దేశ్యంతో ప్రభాస్‌ ఏకంగా 350 కోట్లను ఖర్చు పెట్టి చేసిన సినిమా ఇది.రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం మరో బాహుబలి చిత్రంగా నిలుస్తుందని ప్రభాస్‌ భావించాడు.కాని అనూహ్యంగా సాహో చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.బాహుబలి స్థాయిలో అనుకుంటే అజ్ఞాతవాసి టైప్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది...

Rajamouli Sentiment Repeat In Prabhas Sahoo Movie-bhaubali,charan,chatrapathi,magadheera,prabhas Sahoo,rajamouli,vikramarkudu-Rajamouli Sentiment Repeat In Prabhas Sahoo Movie-Bhaubali Charan Chatrapathi Magadheera Prabhas Rajamouli Vikramarkudu

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరోకు అయినా కొంత కాలం పాటు కష్టాలు తప్పవు.ఆయన దర్శకత్వంలో చేసిన సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం, ఆ తర్వాత హీరోలు కొన్ని సంవత్సరాల పాటు సక్సెస్‌ అంటేనే ఎరుగకుండా ఉండటం జరుగుతుంది.గతంలో చత్రపతి చిత్రంను రాజమౌళి దర్శకత్వంలో చేసిన ప్రభాస్‌ ఆ తర్వాత మరో సక్సెస్‌ను అందుకునేందుకు చాలా సమయం తీసుకున్నాడు.

Rajamouli Sentiment Repeat In Prabhas Sahoo Movie-bhaubali,charan,chatrapathi,magadheera,prabhas Sahoo,rajamouli,vikramarkudu-Rajamouli Sentiment Repeat In Prabhas Sahoo Movie-Bhaubali Charan Chatrapathi Magadheera Prabhas Rajamouli Vikramarkudu

కేవలం ప్రభాస్‌ మాత్రమే కాకుండా రాజమౌళి సెంటిమెంట్‌ దెబ్బ పడ్డ హీరోల్లో ఎన్టీఆర్‌, రవితేజ, రామ్‌ చరణ్‌, సునీల్‌, నితిన్‌లు కూడా ఉన్నారు.వీరంతా కూడా రాజమౌళితో సినిమా చేసి ఆ తర్వాత ఫ్లాప్‌లు చవి చూసిన వారే.ప్రభాస్‌ విషయంలో ఇది రిపీట్‌ అయ్యింది.అత్యంత భారీ బడ్జెట్‌తో సాహోను చేస్తున్న సమయంలో ప్రభాస్‌కు ఎందుకు ఈ సెంటిమెంట్‌ గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి.

సాహో చిత్రం 350 కోట్లలో కనీసం 150 కోట్లను కూడా తీసుకు వచ్చేది అనుమానమే అంటూ ట్రేడ్‌ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.నిర్మాతలు మరియు బయ్యర్లు వందల కోట్లలో నష్టాలను భరించాల్సి వస్తుంది.ఇది ప్రభాస్‌ కెరీర్‌లో పెద్ద మచ్చగా మిగిలి పోనుంది.