మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కి ఆ సెంటిమెంట్?  

July Sentiment for Rajamouli and Mahesh Babu Movie, July, Sentiment, 2021,bahubali, mahesh babu, rajamouli, vikramarkudu - Telugu 2021, Bahubali, July, Mahesh Babu, Rajamouli, Sentiment, Vikramarkudu

దర్శకదీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక సినిమా తీస్తున్నాడు అంటే అది హిట్ కావలసిందే.

TeluguStop.com - Rajamouli Sentiment On Mahesh Babu Movie

ఇక అలానే ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.సూపర్ హిట్ అయ్యాయి.

పెద్ద హీరో అయిన చిన్న హీరో అయిన రాజమౌళితో తీశాడు అంటే ఖచ్చితంగా అది హిట్ అవ్వాల్సిందే.అలా ఉంటుంది రాజమౌళి రేంజ్.

TeluguStop.com - మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కి ఆ సెంటిమెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలా ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో మూడు సినిమాలు, రామ్ చరణ్ తో ఒక సినిమా, ప్రభాస్ తో మూడు సినిమాలు, నానితో ఒక సినిమా, సునీల్ తో ఒక సినిమా తీశాడు.ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నాడు.

అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేq ఎంత కాదు అన్న ఒకటిన్నర సంవత్సరం అవుతుంది.
అయితే ఈ సినిమా అనంతరం మహేష్ బాబుతో రాజమౌళి కలిసి సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.

అయితే రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయనున్నాడు అనేది అందరికి ప్రశ్నార్ధకమే.ఎందుకంటే.

దీని గురించి ఎటువంటి స్పష్టత లేదు.ఆయన జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తాడా? లేకా మహేష్ బాబుతో భారతంలో కృష్ణుడు లాంటి పాత్ర వేపిస్తాడా అనేది తెలియడానికి ఇంకో సంవత్సరం టైమ్ ఉంది.

అయితే ఈ సినిమా గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నప్పటికి దీని గురించి పెద్దగా వార్తలు బయటకు రావడం లేదు.కె.ఎల్.నారాయణ్ తన ”దుర్గా ఆర్ట్స్” బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.2021 జులైలో మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు సంబంధించి అధికారకంగా ప్రకటించాలని ప్లాన్ చేసుకున్నారట.దీనికి కారణం బహుబలి సినిమానే అంట.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన బాహుబలి సినిమాను జులై నెలలోనే ప్రారంబించాడట.కేవలం ఈ ఒక్క సినిమానే కాదు మగధీర, సింహాద్రి, విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ సినిమాలు అన్ని రాజమౌళి జులై నెలలోనే ప్రారంబించాడట.

అందుకే మహేష్ బాబు సినిమాను కూడా వచ్చే ఏడాది జులైలో ప్రకటించనున్నట్టు సమాచారం .

#Bahubali #Mahesh Babu #Sentiment #July #2021

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Sentiment On Mahesh Babu Movie Related Telugu News,Photos/Pics,Images..