ఆర్ఆర్ఆర్ సినిమా అందరూ అనుకునేది కాదు అంటున్న జక్కన్న  

Rajamouli Says RRR Movie Not Freedom fight Story, Tollywood, Telugu cinema, Ram charan, Jr NTR, Pan India Movie, Bollywood - Telugu Bollywood, Jr Ntr, Pan India Movie, Rajamouli Says Rrr Movie Not Freedom Fight Story, Ram Charan, Telugu Cinema, Tollywood

బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తూ ఉండగా ఎన్టీఆర్, రామ్ చరణ్ టైటిల్ రోల్స్ పోషిస్తున్నారు.

 Rajamouli Freedom Fight Tollywood

ఇక అల్లూరి, కొమరం భీమ్ పాత్రల స్ఫూర్తితో సినిమా కథని సిద్ధం చేసినట్లు రాజమౌళి గతంలో చెప్పుకొచ్చారు.ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ పీరియాడికల్ కథ అని స్వాతంత్ర్య ఉద్యమం నేపధ్యంలో ఉంటుందని అందరూ భావించారు.

అల్లూరి, కొమరం భీమ్ ఒకరికి ఒకరు ఎలా స్పూర్తినిచ్చుకొని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు అనే ఎలిమెంట్ కీలకంగా ఉంటుందని తెగ చర్చ నడిచింది.

ఆర్ఆర్ఆర్ సినిమా అందరూ అనుకునేది కాదు అంటున్న జక్కన్న-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా కథ గురించి ఎవరికీ నచ్చినట్లు వారు ఊహించుకాగా వారి ఊహలకి గండి కొడుతూ జక్కన్న సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చారు.

అందరూ భావిస్తున్నట్లుగా ఆర్ఆర్ఆర్ సినిమా ఉండదని తేల్చేశారు.సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యిందని, మిగిలిన సగం కరోనా నుంచి బయటపడగానే పూర్తి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలిపారు.ఈ కథ స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో ఉండదని కేవలం ఆ రెండు పాత్రల మద్యం స్నేహం గురించి మాత్రమే ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

అలాగే సినిమాని ముందుగా అనుకున్న డేట్ ప్రకారమే జనవరి 8 ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేస్తామని జక్కన్న చెప్పారు.మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ఏదో భారీ యాక్షన్ డ్రామా, ఫ్రీడమ్ ఫైట్ ఎలిమెంట్స్ ని ఆకాక్షించగా అలాంటివి ఉండవని జక్కన్న తేల్చేసారు.

#Pan India Movie #Ram Charan #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Freedom Fight Tollywood Related Telugu News,Photos/Pics,Images..