ఆ విషయంలో బాహుబలిని మించిన సినిమా అది!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన విజువల్ వండర్ మూవీ బాహుబలి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా రాజమౌళి చరిత్ర సృష్టించాడు.

 Rajamouli Says Eega Tougher Than Baahubali, Rrr, Rajamouli, Baahubali, Eega,-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తన కెరీర్‌లో అతి కష్టమైన సినిమా ఏమిటనే విషయంపై అవాక్కయ్యే కామెంట్ చేశాడు.

అందరూ బాహుబలి సినిమా రాజమౌళి కెరీర్‌లో అతి కష్టమైన చిత్రం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.కానీ తన కెరీర్‌లో ఈగ సినిమా అన్నిటికంటే కూడా అతి కష్టమైన సినిమా అని చెప్పుకొచ్చాడు.

ఒక ఈగతో రివెంజ్ డ్రామాను తెరకెక్కించేందుకు రాజమౌళి నానా కష్టాలు పడ్డాడట.ఇక తన టెక్నికల టీమ్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని ఆయన చెప్పుకొచ్చాడు.

ఈగ సినిమా తరువాత తనపై తనకు పూర్తి నమ్మకం కుదిరిందని రాజమౌళి చెప్పడం విశేషం.అందుకే బాహుబలి చిత్రం తీసేటప్పుడు పెద్దగా కష్టపడలేదని ఆయన అన్నారు.

కానీ ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు మాత్రం బాహుబలి సినిమాతోనే వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube