అందరికి ఓకే కాని జక్కన్నకు ఓకేనా?  

Rajamouli Rrr Shooting Lockdown Rules - Telugu Less Number People In Shooting, Lockdown Rules, Movie Shootings, Rajamouli, Rrr Movie

తెలుగు సినిమా షూటింగ్స్‌ మొదలు పెట్టేందుకు ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది.అయితే షూటింగ్స్‌కు అనుమతించేందుకు ప్రభుత్వాలు పలు కండీషన్స్‌ పెట్టే అవకాశం ఉంది.

 Rajamouli Rrr Shooting Lockdown Rules

ముఖ్యంగా తక్కువ సంఖ్యలో యూనిట్‌ సభ్యులతో షూటింగ్స్‌ జరపాల్సి ఉంటుంది.ఇరువై నుండి ముప్పై మంది మాత్రమే షూటింగ్‌ స్పాట్‌లో ఉండేలా కండీషన్స్‌ పెట్టబోతున్నారు.

అంత తక్కువ మందితో షూటింగ్స్‌ సాధ్యమేనా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందరికి ఓకే కాని జక్కన్నకు ఓకేనా-Movie-Telugu Tollywood Photo Image

షూటింగ్స్‌కు ఇప్పటికే రెడీ అవుతున్న మేకర్స్‌ అంత తక్కువ మందితో అంటే కష్టంగా ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అలవాటు చేసుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు.అందరు ఓకే కాని రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే సెట్స్‌లో కనీసం వంద నుండి నూటాయాబై మంది అయినా షూటింగ్‌లో పాల్గొంటారు.

అలాంటిది రాజమౌళి కేవలం పాతిక మందితో ముప్పై మందితో షూటింగ్‌ చేయమంటే చేయగలడా అనేది అనుమానమే.

పైగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం పీరియాడిక్‌ భారీ స్వాతంత్య్ర ఉద్యమ సినిమా.వందల మంది సైనికులు, ఉద్యమ కారులు సినిమాల్లో కనిపించాల్సి ఉంది.అలాంటిది తక్కువ సంఖ్యలో షూటింగ్‌ నిర్వహించమంటే మాత్రం సాధ్యం కాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందరికి ఈ కండీషన్స్‌ ఓకే కాని రాజమౌళికి మాత్రం ఈ కండీషన్స్‌ ఓకేనా అనేది అనుమానమే అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Rrr Shooting Lockdown Rules Related Telugu News,Photos/Pics,Images..