‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మళ్లీ ఏమైంది?

సినీ ప్రముఖులు ఈ సమయంలో షూటింగ్‌కు వెళ్లేందుకు భయపడుతుండగా రాజమౌళి మాత్రం గండిపేటలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.షూటింగ్‌ను ఈనెల 26వ తారీకు నుండి అంటే నిన్నటి నుండి ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 What Happen Rajamouli Rrr Movie Shooting, Rajamouli, Rrr, Ramcharan, Jr.ntr, Ali-TeluguStop.com

కాని రాజమౌళి మరోసారి సినిమా షూటింగ్‌ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.మొదట పోలీసుల అనుమతులు రాలేదు అంటూ వాయిదా వేసిన రాజమౌళి ఇప్పుడు ఏకారణంతో వాయిదా వేశాడు అనేది తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్యను చూసి రాజమౌళి భయపడి షూటింగ్‌ను మళ్లీ వాయిదా వేసి ఉంటాడా అనే టాక్‌ వినిపిస్తుంది.కీలకమైన గండిపేట వద్ద షూటింగ్‌ అంటే కాస్త రిస్క్‌తో కూడిన విషయం.

అది కాకుండా అనేక ప్రాంతాల నుండి కాస్ట్‌ అండ్‌ క్రూ షూటింగ్‌కు రావాల్సి ఉంది.అందుకే షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల అనుకున్నారు.కాని ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Telugu Alia Bhatt, Bahubali, Coronavirus, Gandipet Rrr, Jr Ntr, Olivia, Rajamoul

టాలీవుడ్‌లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇంత బడ్జెట్‌తో తెరకెక్కలేదు అన్నట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను రూపొందిస్తున్నారు.రామ్‌ చరణ్‌ అల్లూరిగా ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించబోతున్నారు.ఆలియా భట్‌ ఇంకా ఒలీవియాలు హీరోయిన్స్‌.బాలీవుడ్‌ స్టార్‌ ఆజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube