ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మార్చేశారుగా

ఒకప్పుడు టాలీవుడ్ మూవీ లను బాలీవుడ్ లో రీమేక్ చేసి రిలీజ్ చేయడం చాలా అరుదుగా ఉండేది.అయితే ఒక్క బాహుబలి చిత్రం తరువాత తెలుగు సినిమా ఖ్యాతి దశదిశలా వ్యాపింపజేసిన స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.

 Rajamouli Rrr Nri Ram Charan-TeluguStop.com

ఈ ఒక్క చిత్రం తోనే అన్ని ఇండస్ట్రీలు కూడా తెలుగు సినిమా వైపు మొగ్గు చూపేలా చేసిన క్రెడిట్ రాజమౌళి కి దక్కింది.అయితే బాహుబలి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే, అటు నందమూరి హీరో,ఇటు మెగా హీరో లు కలిసి చేస్తున్న ప్రాజెక్టు కావడం తో అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి అయిన‌ట్టు తెలుస్తుంది.

అయితే ఈ చిత్ర రిలీజ్ అనేది జూలై 30న ఉంటుంద‌ని గతంలో ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు లేట్ అవుతున్న క్ర‌మంలో రిలీజ్ డేట్ మారుతుంద‌న్న వార్తలు వినిపిస్తున్నాయి.తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడని,త్వర‌లో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇవ్వ‌నున్నట్లు సమాచారం.

కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నుండ‌గా, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ సంద‌డి చేయ‌నున్నాడు.

Telugu Alia Bhatt, Jr Ntr, Rajamouli Rrr, Ram Charan-

 చరిత్రలోని రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథతో రూపొందుతున్న ఈ సినిమాలో అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలీవియా,అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.తాజా షెడ్యూల్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.ఇటీవల అజయ్ దేవ్ గణ్ నటించిన తాన్హాజీ చిత్రం బాక్సాఫీజ్ వద్ద కలక్షన్ ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube