అఫిషియల్‌ : ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే!

Rajamouli Rrr Movie Trailer Release Date

రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమా లు డిసెంబర్‌ మొదటి వారం నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా మేము పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాము.

 Rajamouli Rrr Movie Trailer Release Date-TeluguStop.com

నిన్న మొన్న కూడా ట్రైలర్‌ ను డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది.తాము ముందు నుండి చెబుతున్నట్లుగా డిసెంబర్ మొదటి వారంలో భారీ ఎత్తున ట్రైలర్ ను విడుదల చేసేందుకు జక్కన్న టీమ్‌ ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్‌ 3వ ట్రైలర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అఫిషియల్‌ అనౌన్స్మెంట్ వచ్చింది.అద్బుతమైన విజువల్స్ తో మూడు నిమిషాల పాటు ఈ ట్రైలర్ ఉంటుందని మేకర్స్‌ నుండి సమాచారం అందుతోంది.

 Rajamouli Rrr Movie Trailer Release Date-అఫిషియల్‌ : ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Rajamouli, Rrr Trailer-Movie

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లకు సంబంధించిన టీజర్ లు వచ్చాయి.పాటలో ఇద్దరు ఎలా ఉన్నారో తెలిసిపోయింది.కాని సినిమా కథ ఏంటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పారు కాని కథ విషయం లో మాత్రం లీక్ ఇవ్వలేదు.

అందుకే ట్రైలర్ లో ఆ విషయమై ఏమైనా ఆసక్తికర విషయాన్ని జక్కన్న రివీల్‌ చేస్తాడా అనేది చూడాలి.జక్కన్న నుండి ఇప్పటికే వచ్చిన రియాక్షన్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది.

అద్బుతమైన సినిమా అంటూ అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.బాహుబలి ని మించిన వసూళ్లు ఈ సినిమా రాబట్టడం ఖాయం అని అంతా నమ్ముతున్నారు.

మరి ఆర్‌ ఆర్ ఆర్‌ ఇండియాస్ అతి పెద్ద సినిమా గా బాహుబలి ని ఢీ కొట్టి నిలిచేనా చూడాలి.

#RRR Trailer #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube