ఆలియా నెగటివ్ తో ఊపిరి పీల్చుకున్న జక్కన్న

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఎప్పుడు లేనంతగా ఈసారి ఆర్ఆర్ఆర్ కాస్టింగ్‌ తో సమస్యలు ఎదుర్కొంటున్నాడు.మొదట పాత్రలకు తగ్గ నటీనటుల ఎంపిక విషయమై ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

 Rajamouli Rrr Movie Shooting Update, Alia Bhatt, Ntr, Rajamouli, Ram Charan, Rrr-TeluguStop.com

ఆ తర్వాత వారి డేట్లు అడ్జస్ట్‌ కాక పోవడంతో ఇబ్బంది ఎదుర్కొన్నాడు.రెండు మూడు సార్లు డేట్లు లేకపోవడంతో షెడ్యూల్‌ ముందే ముగించిన సందర్బాలు కూడా ఉన్నాయి.

ఇక కరోనా వల్ల సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.బడ్జెట్ విపరీతంగా పెరగడంతో పాటు వర్కింగ్‌ డేస్ ను ఎక్కువ చేయాల్సి వచ్చింది.

ఇటీవల ఈ సినిమా తుది షెడ్యూల్‌ కు అన్ని ఏర్పాట్లు చేసి ఒకటి రెండు రోజుల్లో మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా హీరోయిన్ ఆలియా భట్ కరోనా కారణంగా క్వారెంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది.ఆమె పని చేసిన దర్శకుడు మరియు హీరో కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారన అవ్వడం వల్ల ఆలియా షూటింగ్‌ కు హాజరు అయ్యేందుకు సమయం పట్టడం ఖాయం అనుకున్నారు.

ఇటీవల ఆలియా భట్ కు కరోనా నిర్థారణ పరీక్ష నిర్వహించగా అందులో నెగటివ్‌ అని వచ్చింది.దాంతో ఆమె ఒకటి రెండు రోజుల్లోనే ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ లో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆలియా ఆలస్యం చేయక పోవడం తో సినిమా ను అనుకున్న సమయంకు విడుదల చేసే అవకాశం ఉంది.కనుక జక్కన్న ఊపిరి పీల్చుకుంటున్నాడు అనడంలో సందేహం లేదు.

రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లు కూడా షూటింగ్ కు సిద్దంగా ఉన్నారు.ఇదే సమయంలో చిత్రం కోసం విదేశాల నుండి వచ్చిన ఫైటర్స్ శిక్షణ పొందుతున్నారు.

వచ్చే నెలతో సినిమా కు గుమ్మడి కాయ కొట్టే విధంగా జక్కన్న ప్లాన్ చేశాడు.ఆ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో మళ్లీ ఏమైనా సమస్యలు వచ్చేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube