రాజమౌళి పాపం వారిని 50 రోజులు చంపి వదిలిపెట్టినట్లున్నాడు  

టాలీవుడ్‌ జక్కన్న ఏం చేసినా ది బెస్ట్‌గా అద్బుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఆయన చిన్న సీన్‌ చేసినా కూడా ఎంతో శ్రద్ద పెట్టి తీస్తాడు.

TeluguStop.com - Rajamouli Rrr Movie Shooting Update

ఈ షాట్‌ లో హీరో లేడు కదా.సెకను రెండు సెకన్లు వచ్చే షాట్‌ కదా ఏం ఉందిలో ఏదోలా చేద్దాం అన్నట్లుగా అస్సలు భావించడు.ఆయన ఏం చేసినా కూడా ది బెస్ట్‌ అన్న రీతిలో చేస్తాడు అనడంలో సందేహం లేదు.ఇక ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చిత్రీకరణ చేస్తున్నాడు.కరోనా కారణంగా దాదాపు ఏడు ఎనిమిది నెలలు వాయిదా వేసిన సినిమాను ఎట్టకేలకు అక్టోబర్‌ల ఓ మొదలు పెట్టాడు.షూటింగ్‌ను హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన సెట్‌ లో చిత్రీకరించాడు.

ఆ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ప్రకటించారు.

TeluguStop.com - రాజమౌళి పాపం వారిని 50 రోజులు చంపి వదిలిపెట్టినట్లున్నాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొత్తం 50 రోజుల్లో ఎక్కువ శాతం నైట్‌ షూట్‌ చేశారు.

చలిలో అంత మందితో షూటింగ్‌ ఎలా చేశాడో జక్కన్న అంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు.పాపం నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా ఈ 50 రోజులు చలికి చచ్చిపోయి ఉంటారు.

పని రాక్షసుడు అంటూ రాజమౌళికి పేరు ఉంది.ఈ షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఖచ్చితంగా అనుకుని ఉంటారు అనడంలో సందేహం లేదు.

షూటింగ్‌ సందర్బంగా సెట్‌ లో హీటర్లు పెట్టడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ చేయించారు.ఎంతైనా కూడా ఇంతటి చలిలో రాత్రి సమయంలో షూటింగ్‌ అంటే మామూలు విషయం కాదు.

ఇది జక్కన్నకు మాత్రమే సాధ్యం అయ్యింది.జక్కన్న కాకుండా మరే దర్శకుడు అయినా కూడా ఇంత రాత్రి సమయంలో అంత చలిలో షూటింగ్‌ కు రమ్మంటే ఏ హీరో కాని హీరోయిన్‌ కాని వచ్చేది కాదేమో అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

#RRR Shooting #Netizens #Jakkanna #Coroana #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు