ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల విషయంలో చిన్న క్లారిటీ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా 2021 సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది.కాని కరోనా కారణంగా మొత్తం ప్లానింగ్ తలకిందులు అయ్యింది.

 Rajamouli Rrr Movie Release Date, Rajamouli, Rrr Movie, Ram Charan, Ntr, Rrr Rel-TeluguStop.com

సినిమా షూటింగ్‌ ను జరుపలేక పోయారు.ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది.

మార్చి వరకు షూటింగ్‌ పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

మరో వైపు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా జరుగుతోందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు లేదు.

కాని యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల తేదీని మార్చిలో ప్రకటించబోతున్నారు అంటున్నారు.

Telugu Rajamouli, Rajamouli Rrr, Ram Charan, Rrr, Telugu-Movie

యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్న దర్శకుడు రాజమౌళి సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం లేదు.షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎంత టైం పడుతుంది అనే విషయాన్ని చర్చించి ఆ తర్వాత విడుదల తేదీపై నిర్ణయం తీసుకుంటారు.మరో వైపు థియేటర్ల విషయంలో కూడా మార్చి వరకు క్లారిటీ వస్తుందని ఆయన భావిస్తున్నాడు.

అందుకే ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే అంతా బాగుంటుందని యూనిట్‌ సభ్యులు కూడా భావిస్తున్నారట.మార్చి తర్వాత షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టడం ఖాయం.కనుక షూటింగ్‌ పూర్తి అయిన నాలుగు అయిదు నెలల్లోనే ఖచ్చితంగా సినిమా వస్తుందని మాత్రం చాలా మంది అంటున్నారు.అంటే దసరాకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు కలిసి నటించడంతో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌ హాలీవుడ్‌ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్‌ చేయడం వల్ల వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube