అందరి నోళ్లు మూయించే పనిలో జక్కన్న, వారు మళ్లీ మాట్లాడకపోవచ్చు  

Rajamouli Rrr Movie Complete On Time And Release The Announce The Date - Telugu Rajamouli, Rajamouli Rrr, , Some Members Trolls On Rajamouli Movie, Tollywood Number One Director

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా టాప్‌ డైరెక్టర్‌ అనే పేరు ఉండి పోయింది.ఒక గొప్ప దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు.

Rajamouli Rrr Movie Complete On Time And Release The Announce The Date

బాలీవుడ్‌ సినిమాలను సైతం పక్కకు నెట్టి వసూళ్లను రాబట్టగల సత్తా ఉన్న ఏకైక సౌత్‌ దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి రాజమౌళి గురించి కొందరు కొన్ని రకాలుగా అపోహలు పెట్టుకుని, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు.

వారి నోళ్లు మూయించే పనిలో జక్కన్న ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

రాజమౌళి గొప్ప సినిమాలు చేసిన గొప్ప దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాని రాజమౌళి ఒక్కో సినిమాను చాలా సమయం తీసుకుని చేస్తాడు.చెప్పిన టైంకు ఎప్పుడు కూడా జక్కన్న తన సినిమాలను విడుదల చేసింది లేదు అంటూ కామెంట్స్‌ వస్తూనే ఉంటాయి.అలాంటి జక్కన్న ఇప్పుడు తన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో విమర్శకుల నోళ్లు మూయించాలని ప్రయత్నిస్తున్నాడు.2020 జులై 30న ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేస్తామంటూ ప్రకటించారు.ఆ తేదీకి ఎలాగూ విడుదల అవ్వదని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న జక్కన్న ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జక్కన్న చాలా స్పీడ్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట.ఫిబ్రవరి వరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.

ఆలియా భట్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.బాహుబలి స్థాయిలో ఈ చిత్రం ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test