ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ దశకి వచ్చేసింది

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 Rrr Movie Climax Shooting Started, Tollywood, Bollywood, Rajamouli, Ram Charan,-TeluguStop.com

ఇక సినిమా కోసం రామ్ చరణ్, తారక్ అదే స్థాయిలో కష్టపడుతున్నారు.ఇందులో విప్లవ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమరామ్ భీమ్ పాత్రలలో రామ్ చరణ్, తారక్ కనిపించబోతున్నారు.

రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్న ఫాంటసీ మూవీ ఆర్ఆర్ఆర్ అని ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వచ్చిన రామరాజు, భీమ్ పాత్రలకి సంబందించిన టీజర్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి.

ఒకదానిని మించి ఒక ట్రెండ్ అయ్యి రికార్డులు సృష్టించింది.అన్ని అనుకూలంగా జరిగి ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా అయిపోయి ఉండాలి.

పరిస్థితుల ప్రభావం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిపోయి గత ఏడాది నవంబర్ లో మళ్ళీ ప్రారంభమైంది.అప్పటి నుంచి గ్యాప్ లేకుండా రాజమౌళి ఆర్ఆర్ఆర్ రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తానికి ముగింపు దశకి చేరుకుంది.ఇందులో నటిస్తున్న అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ నటులకి సంబందించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ని జక్కన్న స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇక క్లైమాక్స్ చిత్రీకరణ గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.దీనికి సంబంధించి భీమ్, రామరాజు కలిసి పోరాటం చేయబోతున్నట్లు చేతులని సింబాలిక్ లో చూపించింది.క్లైమాక్స్ చిత్రీకరణ కోసం రాజమౌళి భారీగా ఖర్చు పెట్టబోతున్నాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube