ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రస్తుతం ఏం షూట్‌ చేస్తున్నారో తెలిస్తే ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు రాజమౌళి ఉన్నాడు.

 Rajamouli Rrr Latest Update-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ప్రస్తుతం రామ్‌ చరణ్‌ పాల్గొంటున్నాడు.సినిమాలోనే అత్యంత కీలకమైన సీన్స్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారట.

Telugu Britishalluri, Allurisita, Rajamouli, Rajamoulirrr, Tollywood-

బ్రిటీష్‌ వారు అల్లూరి సీతారామ రాజును అరెస్ట్‌ చేసి చిత్ర హింసల పాలు చేస్తూ ఉంటారు.ఆ తర్వాత అల్లూరిని కోర్టుకు తరలించే సీన్స్‌ కూడా అక్కడ చిత్రీకరణ చేస్తున్నారు.వారం రోజుల తర్వాత ఈ చిత్రీకణ పూర్తి అవ్వబోతుంది.అప్పుడు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లపై ఒక భారీ సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.దాదాపుగా 1000 మంది డాన్సర్స్‌ మరియు జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు వందలాది మంది టెక్నీషియన్స్‌తో ఈ పాటను షూట్‌ చేయబోతున్నారట.

Telugu Britishalluri, Allurisita, Rajamouli, Rajamoulirrr, Tollywood-

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే ఒక వైపు ఈ పాట కోసం సెట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయి బడ్జెట్‌ అవ్వడం వల్ల ఈ పాట ఎంత పెట్టి తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.రామ్‌ చరణ్‌ అల్లూరిగా కనిపించబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీంగా నటించబోతున్నాడు.

ఆలియా భట్‌ హీరోయిన్‌గా ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.ఇంకా బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube