RRR ఇండియాలోనే తొలిసారి... ఆ టెక్నాలజీ తో..! చిన్న బ్రేక్‌ తర్వాత మొదలెట్టేసిన రాజమౌళి.!

బాహుబలి సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా RRR.నవంబర్ 18న సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా డిసెంబర్ చివరి వారంలో తొలి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ముగించింది.తాజాగా జనవరి 21న రెండో షెడ్యూల్‌ను రాజమౌళి ప్రారంభించడం గమనార్హం.కుమారుడు కార్తికేయ పెళ్లి పనులు పూర్తి కావడంతో చిన్న బ్రేక్‌ తర్వాత మళ్లీ షూటింగ్స్‌ బిజీలో పడిపోయారు రాజమౌళి.

 Rajamouli Rrr Is The First Indian Film To Shot On Arri Alexa Lf1-TeluguStop.com

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజమౌళి, కెమెరామేన్‌ సెంథిల్‌ కుమార్‌లది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌.

రాజమౌళి తెరకెక్కించే చిత్రాలన్నింటికీ దాదాపు సెంథిలే కెమెరామేన్‌.వీళ్ల కాంబినేషన్‌లో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సరికొత్త కెమెరాలను ఉపయోగించనున్నారట సెంథిల్‌.భారత్‌లోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ఎఫ్, అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ షూట్ చేస్తున్నాం అని సెంథిల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే కెమెరాకు ఫోజిచ్చిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

RRR చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది.ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రూ.350 కోట్లతో రూపొందిస్తున్నట్టు సమాచారం.తారక్ నెగటివ్ పాత్రలో నటిస్తుండగా…పోలీసు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారంట.రష్మిక, కీర్తి సురేష్ కథానాయికులుగా నటిస్తున్నారని వార్త కూడా వినిపిస్తుంది.ప్రత్యేక పాత్రలో ప్రియమణి కూడా కనిపించనున్నారంట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube