క్షమించండి ప్రేక్షకులతో జక్కన్న... ఆ రోజున రావడం లేదు  

Rajamouli Rrr First Look Teaser Release Date Update-ram Charan,rrr First Look Teaser Date,rrr Movie Rumors,ss Rajamouli,ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు హీరోలుగా రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం భారీ ఎత్తున అంచనాలను కలిగి ఉంది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. సినిమా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామ రాజు మరియు ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలను చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ ఆలియా భట్‌ ఈ చిత్రంలో నటిస్తోంది..

క్షమించండి ప్రేక్షకులతో జక్కన్న... ఆ రోజున రావడం లేదు-Rajamouli RRR First Look Teaser Release Date Update

ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే రోజున ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పూర్తి వివరాలను కూడా క్లారిటీ ఇచ్చేందుకు రెండు నిమిషాల మేకింగ్‌ వీడియోను కూడా విడుదల చేస్తారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి పారేశాడు. ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వాలనుకోవడం లేదు అంటూ స్వయంగా జక్కన్న చెప్పుకొచ్చాడు.

సినిమా విడుదలకు ఇంకా సంవత్సరంకు ఎక్కువే ఉంది. వచ్చే ఏడాది జులై 30వ తారీకున ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రాబోతుంది. సినిమాకు ఇంకా చాలా సమయం ఉన్న ఈ సమయంలో ఎందుకు అప్పుడే సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదల చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. రాజమౌళి సినిమా విడుదల సమయం దగ్గర పడ్డప్పుడు హడావుడి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంటే వచ్చే రిపబ్లిక్‌ డేకు ఏమైనా టీజర్‌ వస్తుందేమో చూడాలి.