‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చిన జక్కన్న  

Rajamouli Rrr Charan Ntr - Telugu Alluri Sitharama Raju, Charan, Charan Police, Ntr, Ntr Komaram Bheem, Rajamouli, Rama Raju And Komaram Bheem, Rrr

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కథ అల్లూరి సీతారామరాజు ఇంకా కొమురం భీమ్‌ పాత్రతో స్వాతంత్య్రంకు పూర్వం కథతో ఉంటుందనే విషయం తెల్సిందే.అయితే తాజాగా విడుదలైన రామరాజు వీడియోలో చరణ్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపించడంతో పాటు బాక్సింగ్‌ బ్యాగ్‌ను కనిపించడంతో రకరకాలుగా అనుమానాలు వస్తున్నాయి.

 Rajamouli Rrr Charan Ntr

అల్లూరి సీతారామరాజు అంటూ పోలీసుగా చూపించడం ఏంటీ అంటూ కొందరు అప్పుడే విమర్శలు గుప్పిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఈ సస్పెన్స్‌ ఏంటీ జక్కన్న అంటున్నారు.

ఈ సమయంలోనే ఒక జాతీయ మీడియా సంస్థకు వీడియో కాలింగ్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి కథ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చాడు.గతంలో తాను చెప్పినట్లుగానే ఈ సినిమా ఖచ్చితంగా రామరాజు, కొమురం భీం పాత్రలతోనే ఉంటుంది.కాని వారి గురించి జనాలకు తెలిసింది నేను చూపించడం లేదు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చిన జక్కన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

వారి గురించి కొన్ని తెలియని విషయాలు ఉన్నాయి.వాటికి సంబంధించి నేను ఎంక్వౌరీ చేసి, కొన్ని కల్పితాలతో కథను తయారు చేసుకున్నాను.

రామరాజు, కొమురం భీంలు ఎప్పుడు కలవలేదు.కాని నేను నా కథల వారిని కలిసినట్లుగా చూపించబోతున్నాను.ఇది పూర్తిగా నా ఊహ మాత్రమే.ఇందులో నిజం ఉందని నేను అనుకోవడం లేదు.

రియల్‌ పాత్రలతో కల్పిత సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుందని, జనాలు ప్రేక్షకులు ఎక్కువగా ఊహించుకోవద్దంటూ ఆయన చెప్పుకొచ్చాడు.అల్లూరి, కొమురం భీమ్‌ జీవిత చరిత్రలను తనదైన శైలిలో చూపించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు