ఆర్ఆర్ఆర్ ప్లాన్ మార్చిన జక్కన్న.. ఎందుకో తెలుసా?  

Rajamouli Rrr - Telugu Dvv Danayya, Ntr, Rajamouli, Ram Charan, Rrr

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Rajamouli Rrr

ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

అయితే తొలుత ఈ సినిమాను 2020 జూలై 31న రిలీజ్ చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావించారు.

ఆర్ఆర్ఆర్ ప్లాన్ మార్చిన జక్కన్న.. ఎందుకో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ సినిమా షూటింగ్ పనుల్లో కొంత ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో జనవరిలో సినిమాను రిలీజ్ చేయలేకపోవచ్చని చిత్ర నిర్మాత డివివి దానయ్య అన్నారు.

దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ రాజమౌళి మాత్రం తన గురి మార్చలేదు.

ఏదిఏమైనా జనవరి 8న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకే ఆయన ఇష్టపడుతున్నారు.ఇందుకు తగ్గట్టుగానే సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు.

అయితే ఇవేమీ ప్రధానమైన మార్పులు కాదని తెలుస్తోంది.వీటి వల్ల సినిమాకు ఎలాంటి నష్టం జరగదని ఆయన అంటున్నారు.

దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 8న రిలీజ్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఒకవేళ ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు ఇది నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు