'ఆర్‌ఆర్‌ఆర్‌' రహస్యం లీక్‌ అయ్యింది!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాహుబలి వంటి అద్బుత దృశ్యకావ్యంను తెరకెక్కించిన రాజమౌళి ఇద్దరు స్టార్‌ హీరోలతో సినిమా చేస్తున్నాడు అంటే బాహుబలిని మించి ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

 Rajamouli Reveals Rrr Movie Title In Fullform-TeluguStop.com

అంచనాకు తగ్గట్లుగానే దర్శకుడు ఒక అద్బుతమైన స్వాతంత్య్ర సంగ్రామంకు సంబంధించిన నేపథ్యంను తీసుకున్నాడు.

రెండు భిన్న దృవాలైన అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీంలను తన పాత్రదారులుగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

జక్కన్న బాహుబలి చిత్రంను తన అసలు సినిమా పేరుగా అనుకోలేదు.కాని దానికే ఎక్కువ ప్రమోషన్‌ దక్కింది కనుక అదే పేరును ఫైనల్‌ చేశాడు.ఇక ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేశారు.దాంతో అదే బాగుందని అంతా అనడంతో సినిమాకు ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు.

Telugu Jr Ntr, Rajamouli, Ram Charan, Ramaroudra, Rrr Full Form-

 అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ఏంటీ అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.తాము కొన్ని అనుకున్నాం, మీకు తోచినవి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ రాజమౌళి ప్రెస్‌మీట్‌లో చెప్పాడు.తాజాగా రాజమౌళి టీం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ ఫుల్‌ ఫామ్‌ లీక్‌ అయ్యింది.అదేంటి అంటే ‘రామ రౌద్ర రుషితం’.ఈ టైటిల్‌ చాలా పవర్‌ ఫుల్‌గా అన్ని భాషలకు కూడా కనెక్ట్‌ అయ్యే విధంగా ఉందని అంటున్నారు.అయితే భాష భాషకు వేరు వేరు అబ్రవేషన్స్‌ ఇస్తామని జకన్న చెప్పాడు.

కాని అన్ని భాషలకు ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube