అందుకే ఆ హీరోను తీసుకున్నా: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 Rajamouli, Ajay Devgan, Rrr, Ntr, Ram Charan-TeluguStop.com

ఇక ఇటీవల ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌లు రిలీజ్ కావడంతో ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల అజయ్ దేవ్గన్ పనితీరుపై జక్కన్న ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఈ సినిమాలో అజయ్ దేవ్గన్‌ను మాత్రమే ఎందుకు తీసుకున్నాడో చెప్పుకొచ్చాడు బాహుబలి సృష్టికర్త.

బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఉండగా అజయ్ దేవ్గన్‌ను మాత్రమే రాజమౌళి ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్నకు ఆయ సమాధానం ఇచ్చారు.మిగతా హీరోల్లో తనకు కనిపించడి కమాండ్, నిజాయితీ అజయ్ దేవ్గన్‌లో చూశానని, అందుకే ఆయన్ను ఈ సినిమాలో తీసుకున్నానంటూ రాజమౌళి కుండబద్ధలు కొట్టాడు.

మొత్తానికి అజయ్ దేవ్గన్ అంటే ఎంత ఇష్టం లేకపోతే ఆయన్ను ఇలా ఆకాశానికి ఎత్తేస్తాడు జక్కన్న అని కొందరు అంటున్నారు.ఇక అజయ్ దేవ్గన్‌‌లో ఇలాంటి లక్షణాలు కచ్చితంగా ఉన్నాయని, అందుకే ఇతర దర్శకులు సైతం ఆయన్ను తీసుకునేందకు ఇష్టపడతారని పలువురు అంటున్నారు.

మరి అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube