ఆ సెంటిమెంట్ నే నమ్ముకున్న రాజమౌళి.. ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ముందుగా అనుకున్న ప్రకారం 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఊహించని కారణాల వల్ల ఈ సినిమా అంతకంతకూ వాయిదా పడుతూ వస్తోంది.

 Rajamouli Repeats Baahubali Sentiment For Rrr Movie,rrr Movie, Baahubali Sentime-TeluguStop.com

అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి గత సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉండటం గమనార్హం.
నిజ జీవితంలో ప్రభాస్ తో పోల్చి చూస్తే రానా వయస్సు ఆరు సంవత్సరాల కంటే తక్కువ.

అయితే బాహుబలి సిరీస్ సినిమాల్లో మాత్రం రాజమౌళి రానాను పెద్దవాడిగా ప్రభాస్ ను చిన్నవాడిగా చూపించాడు.ఆ సెంటిమెంట్ తో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజమౌళి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ను పెద్దవాడిగా జూనియర్ ఎన్టీఆర్ చిన్నవాడిగా రాజమౌళి చూపిస్తున్నారు.

అందువల్లే టీజర్ లో సైతం రాజమౌళి రామ్ చరణ్ తో ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలిపించాడు.ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ రెండేళ్లు చిన్నవాడనే సంగతి తెలిసిందే.

నిజజీవితంలో అల్లూరి భీమ్ కంటే పెద్ద అయినప్పటికీ ఆ పాత్రతో రాజమౌళి తమ్ముడు అని పిలిపించడానికి సెంటిమెంట్ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నా రాజమౌళి మాత్రం వాటిని పట్టించుకోకుండా షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు.షూటింగ్ ఆలస్యమవుతున్నా ఆర్ఆర్ఆర్ అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ కెరీర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉందని ఆయా హీరోల అభిమానులు భావిస్తున్నారు.2021 దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube