టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి తెలియని వారెవ్వరూ లేరు.కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా రాజమౌళి సినిమాలకు మంచి అభిమానం ఉంది.
బాహుబలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు రాజమౌళి.ఆ సినిమా తర్వాత నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్నాడు రాజమౌళి.
ఇక రాజమౌళిని చూసి మిగతా స్టార్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే చాలా మంది స్టార్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించారు.
కానీ రాజమౌళి అందుకున్నంత క్రేజ్ ను అందుకోలేక పోతున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా రాజమౌళి రెమ్యూనరేషన్ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తన దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాకు రాజమౌళి పారితోషికం రూ.450 కోట్లు అని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాకు దర్శకుడు, హీరోల రెమ్యునరేషన్, జీఎస్టీ లేకుండానే రూ.336 కోట్లు అయ్యాయట.

ఇక హీరోల పారితోషికం, జీఎస్టీ కలిపితే రూ.600 కోట్లు ఇవ్వవచ్చని తెలుస్తోంది.ఇందులో రాజమౌళి పారితోషికం మాత్రం లేదని తెలుస్తుంది.
ఈ సినిమా లాభాల్లో 30 శాతం ఇవ్వాలని రాజమౌళి ఈ సినిమాను ప్రారంభించారట.ఒకవేళ రూ.2 వేల కోట్లు రాబట్టిందని అనుకుంటే.అన్ని ఖర్చులు పోగా రూ.1500 కోట్లు లాభాలు వస్తాయి.ఇక ఇందులో 30 శాతం అంటే దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో రాజమౌళి పారితోషికం బాగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.