బాహుబలితో రాజమౌళికి అందే డబ్బు ఎంతో తెలుసా? షాక్ అవుతారు

జక్కన్న ఐదేళ్ళు కష్టపడి చెక్కిన బాహుబలి సీరీస్ అందరు ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.29 రాష్ట్రాలలో మొదటిరోజు రికార్డు బద్దలు కొట్టడం అంటే మామూలు విషయమా? అసలు ఇంతవరకు ఏ బాలివుడ్ సినిమా చేయలేకపోయింది.ఖాన్ త్రయం ఎవరి వల్లా కాలేకపోయింది.అలాంటి కష్టతరమైన రికార్డులని అవలీలగా దాటేస్తూ, మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు, రెండురోజుల్లో 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి 500 కోట్ల మార్కుని మూడురోజుల్లో దాటేయనుంది బాహుబలి 2.అసలు ఎవరు ఊహించారు ఇలాంటి లెక్కలు? ఎవరనుకున్నారు ఓ తెలుగు సినిమా ఇలాంటి చరిత్ర సృష్టిస్తుందని.మరి ఈ చరిత్ర కారణమైన జక్కన్న కష్టానికి దక్కే ప్రతిఫలం ఎంత? రాజమౌళికి ఎంత డబ్బు చెల్లిస్తున్నారు నిర్మాతలు?

 How Much Rajamouli Will Get Paid For Baahubali 2?-TeluguStop.com

ఎంత చెల్లిస్తారో ఇప్పుడే తేలదు.ఎందుకంటే బాహుబలి రన్ మరో నెల రోజులైనా కంటిన్యూ అయ్యేలా ఉంది.రన్ కి పారితోషికానికి సంబంధం ఏమిటంటే, రాజమౌళి తీసుకోబోయేది లాభాల్లో వాటా.వచ్చిన షేర్ లో పంపిణిదారులకి ఇచ్చేది పోను, మిగిలిన లాభాల్లో, 1/3 రాజమౌళికి చెల్లించాలి.అంటే బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా ఓ 600 కోట్ల షేర్ సాధించింది అనుకోండి .అందులో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రఫ్ గా 450 కోట్లు అనుకోండి (350 కోట్ల దాకా చెల్లించి కొన్నారు), ఇక్కడ 150 కోట్ల లాభాలు మిగులుతాయి.సాటిలైట్, మెర్చెండైస్ హక్కులు కలిపి మరో 150 కోట్ల దాకా ఉంటాయి.

ఓ 30-40 కోట్ల లెక్క అటు ఇటుగా తీసుకున్నా, రాజమౌళికి 80 కోట్ల దాకా అయినా ముడతాయి.ఆ లెక్క 100 కోట్లకి చేరినా చేరవచ్చు.

చూసారా ఎంత ముట్టబోతోందో? రాజమౌళికి దక్కే డబ్బుతో కూడా ఓ భారి సినిమా తీసేయవచ్చు.ఇది టూమచ్ అని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే రాజమౌళి బ్రాండ్ లేనిదే ఈ వందలు, వేల కోట్ల వసూళ్ళు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube