మూవీ గురించి చెప్పడానికి రెడీ అవుతున్నరాజమౌళి!  

శుక్రవారం ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన విషయాలని మీడియాతో పంచుకోవడానికి రెడీ అయిన రాజమౌళి. .

Rajamouli Ready To Announce Details On Rrr Movie-jr Ntr,keeravani,rajamouli,ram Charan,ready To Announce Details,rrr Movie,telugu Cinema,tollywood

బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి డివివి దానయ్య ప్రొడక్షన్లో తారక్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీ స్టారర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మరో వైపు ఇందులో కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో కూడా రాజమౌళి వున్నాడు...

మూవీ గురించి చెప్పడానికి రెడీ అవుతున్నరాజమౌళి! -Rajamouli Ready To Announce Details On RRR Movie

అలాగే ఈ సినిమా కోసం కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్ కూడా జక్కన్న స్టార్ట్ చేసారు. త్వరలో గోవా బేస్ చేసుకొని లాంగ్ షెడ్యూల్ కి జక్కన్న మరో వైపు ప్లాన్ చేస్తున్నాడు. ఇలా అన్ని రకాల వర్క్స్ ని శరవేగంగా సాగిస్తున్న రాజమౌళి ఈ సినిమాని వీలైనంత తక్కువ టైంలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాలో తారక్ కందల వీరుడుగా, రామ్ చరణ్ స్టైలిష్ గడ్డం లుక్ తో కనిపిస్తారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీ లో హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీస్ అలియా బట్, పరిణితి చోప్రాని ఫైనల్ చేసినట్లు కూడా జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో మరో కీలక పాత్ర కోసం అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ని జక్కన్న సంప్రదించాడని కూడా జోరుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఈ వార్తల నేపధ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్ ఉండబోతుంది అనే విషయాన్ని రాజమౌళి ప్రకటించి మరింత ఆసక్తి పెంచారు. ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్, తారక్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. మరి ఈ మీడియా సమావేశంలో రాజమౌళి సినిమా గురించి చెప్పబోయే ఆసక్తికర విషయాలు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నారు.