అప్పటికి ఇప్పటికి రామ్ చరణ్ వేరు అంటున్న జక్కన్న  

Rajamouli Ram Charan Best Actor Jakkanna - Telugu Pan India Movie, Rajamouli Praises Ram Charan Transformation As A Best Actor, Rrr Movie, Telugu Cinema, Tollywood

మెగాస్టార్ తనయుడుగా టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసి మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని రెండో సినిమాకే ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక రంగస్థలం సినిమాతో నటుడుగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకొని ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Rajamouli Ram Charan Best Actor Jakkanna

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకి సంబందించిన విశేషాలని మీడియాతో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మీద ప్రశంసలు కురిపించాడు.

అప్పటికి ఇప్పటికి రామ్ చరణ్ వేరు అంటున్న జక్కన్న-Movie-Telugu Tollywood Photo Image

మగధీర సినిమా సమయంలో నేను చేసిన రామ్ చరణ్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది.

రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ నటనలో చాలా మెట్లు ఎక్కేసాడు.ప్రతి సినిమాకి తనని తాను కొత్తగా మలుచుకుంటూ ఎంతో కొంత ప్రత్యేకత చూపించే ప్రయత్నం చరణ్ చేస్తున్నాడు.

మెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన కూడా ఆ ఇమేజ్ క్రింద ఉండిపోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో నటనని ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూసాను.

చరణ్ ఈ స్థాయిలో పరిణితి చూపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.ఎంత పెద్ద స్థాయిలో ఉన్న కూడా ఒదిగి ఉండే నేచర్ కూడా రామ్ చరణ్ ని గొప్పగా తయారు చేసింది అంటూ రాజమౌళి అతని మీద ప్రశంసలు కురిపించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rajamouli Praises Ram Charan Transformation As A Best Actor Related Telugu News,Photos/Pics,Images..