ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌ను పక్కకు పెట్టిన జక్కన్న... దుబాయి వెళ్లిన ఎన్టీఆర్‌  

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం భారీ మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన జక్కన్న ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ పనిలో నిమగ్నమై ఉన్నాడు.

Rajamouli Puts Side To NTR In RRR Movie-Jr Ntr Parineeti Chopra Rajamouli Ram Charan Rama Ravana Rajyam Rrr Movie

Rajamouli Puts Side To NTR In RRR Movie

రెండవ షెడ్యూల్‌ ఆరంభంలో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ కలిసి నటించారు. కాని ప్రస్తుతం కేవలం చరణ్‌ పై మాత్రమే షూట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు నెల రోజుల గ్యాప్‌ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్‌ ప్రస్తుతం దుబాయి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్‌ వేసిన ఎన్టీఆర్‌ ఈ నెల చివర్లో వస్తాడని తెలుస్తోంది. మార్చి రెండవ వారం నుండి ఎన్టీఆర్‌పై చిత్రీకరణ జరుపబోతున్నాడు. ఎన్టీఆర్‌ దుబాయికే ఎందుకు వెళ్లాడు అనే చర్చ మొదలైంది. జక్కన్న సలహా మేరకే ఎన్టీఆర్‌ దుబాయి వెళ్లాడని, అక్కడ పాత్ర కోసం కొంత వర్కౌట్స్‌ చేయాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది.

Rajamouli Puts Side To NTR In RRR Movie-Jr Ntr Parineeti Chopra Rajamouli Ram Charan Rama Ravana Rajyam Rrr Movie

ఎన్టీఆర్‌ హీరోగా గత చిత్రం అరవింద సమేత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రంపై అంచనాలు మరింతగా ఉన్నాయి. దానికి తోడు రాజమౌళి దర్శకత్వం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక చిత్రంను 2020వ సంవత్సరంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఈ చిత్రంను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి బాహుబలి స్థాయిలో నిలపాలన్నది జక్కన్న ప్లాన్‌గా తెలుస్తోంది.