టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లుగా అంతా ఎదురు చూశారు.సినిమా విడుదల తేదీకి సంబంధించిన విషయమై గత కొన్ని రోజులుగా ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
అందుకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.సినిమా షూటింగ్ ముగిసిన కారణంగా దసరాకు సినిమాను విడుదల చేస్తారంటూ అంతా ఆశించారు.
కాని రాజమౌళి మాత్రం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని కారణంగా విడుదల వాయిదా వేసేందుకు సిద్దం అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ప్రెస్ మీట్ తో సంబంధం ఉంది.
ప్రెస్ మీట్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ విషయమై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తే ఇక ఇతర సినిమాలు విడుదల కు రంగం సిద్దం అవుతుందని అంతా భావించారు.
మీడియా సమావేశం విషయంలో జక్కన్న సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సమ్మర్ లో ఉగాది కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ లో వస్తే థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ లేవు.పర్వాలేదు విడుదల చేద్దాం అనుకున్నా కూడా ఇతర దేశాల్లో కూడా పరిస్థితులు అస్సలు బాగా లేదు.కనుక ఆర్ ఆర్ ఆర్ సినిమా ను వాయిదా వేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు.కాని ఈ సినిమా ను వచ్చే ఏడాది జనవరి లో 26 వస్తుందని అంతా ఆశించారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల కనీసం 9 నుండి 10 నెలల సమయం తీసుకునేలా ఉందంటూ నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రెస్ మీట్ ఏర్పాట్టు చేసి సినిమాను ఎప్పుడు విడుదల చేసేది ప్రకటిస్తారేమో చూడాలి.