మహేష్-ప్రభాస్ కాంబినేషన్! భారీ మల్టీ స్టారర్ ప్లానింగ్ లో జక్కన్న  

Rajamouli Plan To Multi Starer After Rrr Movie - Telugu Bollywood, Mahesh Babu, Prabhas, Rajamouli Plan To Multi Starer, Rrr Movie, Tollywood

దర్శక దిగ్గజం రాజమౌళీ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.రామ్ చరణ్, తారక్ కాంబినేషన్ లో తెలుగులో ఫస్ట్ టైం భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Rajamouli Plan To Multi Starer After Rrr Movie

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని డివివి దానయ్య నిరిస్తున్నారు.ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.

ఇక హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ కూడా సినిమా కోసం పని చేస్తున్నారు.

ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని జక్కన్న ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాడు.దీనికి సంబందించిన బిజినెస్ ని కూడా మెల్లగా పూర్తి చేసేస్తున్నాడు.

దీంతో సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ రాజమౌళీ ఎక్కువ గ్యాప్ తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో సినిమా తర్వాత రాజమౌళీ చేయబోయే సినిమా ఏమై ఉంటుందని చర్చ అప్పుడే మొదలైంది.

ఆర్ఆర్ఆర్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రాజమౌళీ టార్గెట్ పెట్టిన జక్కన్న నెక్స్ట్ సినిమా కూడా భారీ మల్టీ స్టారర్ గానే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా పట్టాలేక్కుతుందని సమాచారం.ఈ సినిమాని సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మిస్తారని తెలుస్తుంది.అయితే ఈ సినిమాని కూడా జక్కన్న భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీనికి సంబందించిన కథని కూడా జక్కన్న తండ్రి విజయేంద్రవర్మ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా కూడా ఫినిష్ చేసిన తర్వాత రాజమౌళీ మహాభారతం సిరీస్ మీద దృష్టి పెడతాడని తెలుస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

Rajamouli Plan To Multi Starer After Rrr Movie-mahesh Babu,prabhas,rajamouli Plan To Multi Starer,rrr Movie,tollywood Related....