అలియా భట్, రామ్ చరణ్... ఓ రొమాంటిక్ సాంగ్

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ మెయిన్ లీడ్స్ లో నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమాగా దీనిని రాజమౌళి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

 Rajamouli Plan Romantic Song On Ram Charan And Alia Bhatt, Rrr Movie, Jr Ntr, Bo-TeluguStop.com

ఇక ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.షూటింగ్ ఊదా ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది.

ఈ నేపధ్యంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఇక ఆచార్య షూటింగ్ అయిన తర్వాత ఈ నెల 12 నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.ఇక 12 నుంచి అలియా భట్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది.

ఇక 12 తర్వాత సినిమాలోని పాటలని ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరించుకుంటూ వెళ్లాలని రాజమౌళి షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో ఓ స్టూడియోలో రామ్ చరణ్, అలియా భట్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించేందుకు సెట్ వేస్తున్నారని తెలుస్తుంది.

కంప్లీట్ నేచురల్ ఎలివేషన్ ఉండే విధంగా బాహుబలిలో ధీవర స్టైల్ లో ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ యాంగిల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో అలియా కూడా మరో రెండు రోజుల్లో షూటింగ్ కోసం హైదరాబాద్ రాబోతుంది.

అక్టోబర్ 13న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకొని ఓ వైపు షూటింగ్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులని కూడా పూర్తి చేసేస్తున్నాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube