రాజమౌళి భారీ స్కెచ్.. సమంతను రంగంలోకి.. అంతా సిద్ధం?

తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.చిన్నప్పటినుంచి సినిమా బ్యాక్గ్రౌండ్ చుట్టూ పెరగడం వల్ల ఈయనకు సినిమాలపై ఎంతో మంచి పట్టు వచ్చింది.

 Rajamouli Perfect Sketch Samantha For The Mahesh Babu Movie Details,  Rajamouli,-TeluguStop.com

తన తండ్రి మంచి రచయిత కావడంతో రాజమౌళి సినిమాల పై ఎంతో మక్కువ పెంచుకుని దర్శకుడిగా అన్ని మెళకువలు నేర్చుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఈ క్రమంలోనే రాజమౌళి ప్రభాస్ రానా అనుష్క ప్రధాన పాత్రలలో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరూ యోధులను ఈ సినిమా ద్వారా రాజమౌళి కలపబోతున్నారు.

ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇద్దరు సూపర్ హీరోలతో మల్టీస్టారర్గా వస్తున్నటువంటి ఈ చిత్రం కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

Telugu Anushka, Bahubali, Mahesh Babu, Maheshbabu, Prabhas, Rajamouli, Samantahm

ఇకపోతే ఈ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన జక్కన్న తన తరువాత ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని భావించారు.అయితే ఈ మహేష్ బాబు సినిమా కోసం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలియడంతో ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anushka, Bahubali, Mahesh Babu, Maheshbabu, Prabhas, Rajamouli, Samantahm

సాధారణంగా రాజమౌళి తన సినిమాలలో హీరోయిన్లను రిపీట్ చేయరు.కేవలం ఒక్క అనుష్కని మాత్రమే రాజమౌళి తన తర్వాత చిత్రాలలో హీరోయిన్ గా రిపీట్ చేశారు.రవితేజ సరసన విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్ అనుష్క నటించగా తిరిగి ఆమెను బాహుబలి చిత్రంలో తీసుకున్నారు.అయితే మరోసారి రాజమౌళి హీరోయిన్లను రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయకురాలిగా సమంత పేరు వినబడుతుంది.

Telugu Anushka, Bahubali, Mahesh Babu, Maheshbabu, Prabhas, Rajamouli, Samantahm

సమంత ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈగ సినిమాలో నటించారు.ఈ క్రమంలోనే మరోసారి రాజమౌళి సమంతను అప్రోచ్ అయ్యారు అని అందుకు సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక సమంత విషయానికొస్తే ఇదివరకే మహేష్ బాబుతో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలలో నటించారు.

బ్రహ్మోత్సవం ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.ఈ క్రమంలోనే మరొక సారి వీరిద్దరి కాంబోలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అందరికీ భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఇంకా విడాకుల తర్వాత సమంత కూడా స్టార్ హీరోలతో స్టార్ డైరెక్టర్ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే సమంత ఏ మాత్రం వదులుకోదని తెలుస్తుంది.

మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube