రాముడు లాంటి భీముడు నాకు దొరకడు అంటోన్న జక్కన్న

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు(మే 20న) తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని ఆయన ఫ్యాన్స్‌ను కోరాడు.

 Rajamouli Wishes Ntr With Special Pic, Rajamouli, Ntr, Rrr, Ntr Birthday, Tollyw-TeluguStop.com

దీంతో తారక్ పుట్టినరోజును అభిమానులు చాలా సాదాసీదాగా, పలు సామాజిక కార్యక్రమాలతో నిర్వహించేందుకు రెడీ అయ్యారు.అయితే తారక్‌తో ఇండస్ట్రీలో ఎక్కువ అనుబంధం ఉన్న దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్‌కు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రస్తుతం రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.అయితే మే 20న ఈ చిత్రం నుండి తారక్ ఫస్ట్ లుక్ వస్తుందని అందరూ అనుకున్నా, లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు.

దీంతో తారక్‌తో తనకున్న అనుబంధంను జక్కన్న ఒక పాత ఫోటోతో వ్యక్త పరిచాడు.రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నెంబర 1’ నుండి తారక్ తనకు తోడుగా ఉన్నాడని, జక్కన్న అన్నారు.

‘మొదటి నుండి నా విజయ యాత్రలో తోడుగా ఉన్నావు.చాలా సంతోషం, హ్యాపీ బర్త్ డే డియర్ తారక్.నీకన్నా ఉత్తమైన భీమ్ నాకు దొరకడు’ అంటూ జక్కన్న ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌లో తారక్ చేయబోయే పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని, అతడి కెరీర్‌లోనే ఇది బెస్ట్ పాత్రగా ఉండబోతుందని జక్కన్న అన్నారు.

ఇక ఆర్ఆర్ఆర్ నుండి తారక్ ఫస్ట్ లుక్‌ను వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అటు ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి నందమూరి ఫ్యాన్స్‌కు ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube