'ఆర్ఆర్‌ఆర్‌' కేవలం ఆ రైట్స్ తోనే రూ.260 కోట్లను రాబట్టేసిందట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్‌ఆర్ సినిమా పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.ఇండియన్ సినీ మార్కెట్‌ లోనే కాకుండా ఈ సినిమా అన్ని భాషల్లో అన్ని దేశాల్లో కూడా ఆడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

 Rajamouli Ntr Ram Charan Rrr Movie Ott Rights Prize , Rajamouli, Ntr, Ram Charan-TeluguStop.com

బాహుబలి చైనాలో ఆడలేదు.కాని ఈ సినిమా అక్కడ వందల కోట్లు వసూళ్లు చేయడం పక్కా అంటూ నమ్మకంగా మేకర్స్ ఉన్నారు.

అందుకే ఈ సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ అవ్వుతుంది.థియేట్రికల్‌ రైట్స్ ద్వారా వెయ్యి కోట్ల వరకు వస్తాయనే అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ఏకంగా 260 కోట్లకు అమ్ముడు పోయింది అంటూ సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ను ఒక అంతర్జాతీయ స్థాయి ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ సినిమా ను ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

400 కోట్లకు పై బడిన బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ వచ్చే నెలతో పూర్తి కాబోతుంది.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను టార్గెట్‌ గా పెట్టుకుని ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.

ఇదే సమయంలో సినిమా లోని నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు సినిమా అంచనాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్ కూడా వంద కోట్లకు పైగా రాబట్టే అవకాశం ఉంది.

ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా బిజినెస్ చేసి ఉండదు అనడంలో సందేహం లేదు.అద్బుతమైన వసూళ్లను రాబడుతుందనే నమ్మకం బాలీవుడ్‌ వర్గాల్లో కూడా ఉంది.

ఈ సినిమా కు మాత్రమే బాహుబలి 2 ను బీట్‌ చేసే సత్తా ఉందని అంతా నమ్ముతున్నారు.బాహుబలి 2 అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కలిపి దాదాపుగా 2500 కోట్ల ను నిర్మాతలకు తెచ్చి పెట్టిన విషయం తెల్సిందే.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ 3 వేల కోట్ల వరకు తీసుకు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube