రాజమౌళికి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ తలనొప్పి..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.

 Rajamouli New Headech With Rrr Promotions Details, Director Rajamouli, Rrr Movie-TeluguStop.com

పలు రకాల కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.దీంతో రాజమౌళి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వాస్తవానికి జనవరి 7న ఈ సినిమా విడుదల కావాలి.ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల చేయాలని సినిమా యూనిట్ భావించింది.

అందులో భాగంగానే ప్రచారం ఓ రేంజిలో చేశారు.ఈ ప్రచార కార్యక్రమాల కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలను కేటాయించారు.

దీంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ జోరుగా ప్రచారం చేశారు.రాజమౌళి కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.బాలీవుడ్ లో ఏకంగా వారం రోజుల పాటు మకాం వేశాడు.అన్ని మీడియా చానెల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

కపిల్ శర్మ షోలోనూ పాల్గొన్నాడు.అటు ప్రో కబడ్డీ, ఫుట్ బాల్ గేమ్ ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు.

తమ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని అద్భుతంగా చేశాడు.కానీ చివరకు సినిమా రిలీజ్ వాయిదా పడింది.

గతం ఎలా ఉన్నా.తాజాగా ఈ సినిమా విడుదలకు రెండు డేట్లను ప్రకటించాడు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Rajamouli, Pan India, Ram Charan, Rrr, Rrr Ups,

మార్చి 18 లేదంటే ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు.అధికారికంగా సినిమా యూనిట్ ఈ ప్రకటన చేసింది.పరిస్థితుల్లో మార్పులు ఏర్పడి.థియేటర్ల దగ్గర సాధారణ పరిస్థితి ఉంటే మార్చి 18న ఈ సినిమా విడుదల కానుంది.లేదంటే ఏప్రిల్ 28 వరకు ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేయక తప్పదు.మొత్తానికి ఏదో ఒకరోజున ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Rajamouli, Pan India, Ram Charan, Rrr, Rrr Ups,

ఈ నేపథ్యంలో మరోసారి ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారట.ఇందుకోసం ఈ సినిమాలో నటించిన స్టార్స్ సిద్ధంగా ఉండాలని చెప్పాడట.ఇక సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని కూడా రివీల్ చేయకూడదని దర్శకుడు ఆయా నటీనటులకు వెల్లడించాడట.గతంలో జరిగిన ప్రచారంలో దర్శకుడితో పాటు ఆలియా భట్, హీరోలు కూడా పాల్గొన్నాడు.

ప్రస్తుతం అందరూ పాల్గొనకపోవచ్చనే టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube