తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రాజమౌళి( Rajamouli ) ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.కానీ ఆయన కెరియర్ లో తీసిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి.
ఇక రాజమౌళి సినిమాకి కథలను అందించే వాళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ కి( Vijayendra Prasad ) కూడా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ సినిమా( Yamadonga ) అంటే ఆయనకి పెద్దగా నచ్చదట.ఆ సినిమాలో అన్ని బాగున్నప్పటికీ ఆ సినిమాని ఎందుకో ప్రేక్షకులు అంత ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి.

ఇక విజయేంద్రప్రసాద్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయాలను తెలియజేశాడు.ఈ సినిమాకి కథను అందించింది కూడా విజయేంద్రప్రసాద్ కావడం విశేషం…అయినప్పటికీ ఈ సినిమా ఆయనతో పాటు చాలామందికి పెద్దగా నచ్చదు.ఇక రాజమౌళి తీసిన అన్ని సినిమాల్లో యమదొంగ, మర్యాద రామన్న( Maryada Ramanna ) సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణ అయితే పొందినట్టుగా కనిపించదు.జక్కన్న ఏ సినిమా చేసిన పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలను కూడా తెరకెక్కించారు.
కానీ సినిమాలో ఏదో మిస్సయింది అనే వెలతి అయితే చూసే అభిమానులకి కలుగుతుంది.

అందులో భాగంగానే ఈ సినిమాలని ఒక్కసారి కంటే ఎక్కువగా చూడలేము.అదే సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర , బాహుబలి లాంటి సినిమాలను మాత్రం ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఆ సినిమాలను ఇప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ఇక మొత్తానికైతే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ, మర్యాద రామన్న సినిమాలు అంటే వాళ్ళ నాన్న ఆయన విజయేంద్ర ప్రసాద్ కి పెద్దగా నచ్చదనే విషయం అయితే తెలుస్తుంది…
.