దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.బాహుబలి వంటి విజువల్ వండర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం ఆడియెన్స్ చాలా ఆతృతగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా టైటిల్ ఆర్ఆర్ఆర్కు అర్ధం ఏమిటనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.కాగా ఈ సినిమా టైటిల్ ‘రామ రావణ రాజ్యం’ అంటూ ఇండస్ట్రీలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
దాదాపు ఇదే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ తాజాగా రాజమౌళి ఈ టైటిల్‌ను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.వి3 ఫిలింస్ సంస్థ ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్‌ను తమపేరున రిజిస్టర్ చేయించుకున్నారు.
దీంతో ఆర్ఆర్ఆర్ పూర్తి టైటిల్ రామ రావణ రాజ్యం కాదని ఇప్పుడు అఫీషియల్ అయ్యింది.
మరి ఈ సినిమాకు టైటిల్ ఏమిటనే ప్రశ్న మళ్లీ మొదటికి వచ్చింది.కాగా చాలా యాప్ట్ టైటిల్‌ను మిస్ చేసుకున్నందుకు జక్కన్న తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.