చరణ్ కోసం గుసగుసలాడుతున్న ఇద్దరు డైరెక్టర్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Ram Charan, Rajamouli, Koratala Siva, Rrr, Acharya-TeluguStop.com

ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇంకా ఓకే చేయకపోయినా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యాకే ఆచార్యలో అడుగుపెట్టాలని జక్కన్న ఆర్డర్ వేశాడు.

కానీ కొరటాల శివ మాత్రం చరణ్‌ను వెంటనే ఆచార్య సినిమాలో నటించాల్సిందిగా కోరాడట.దీనిక సంబంధించిన ఇద్దరు దర్శకులు డిస్కషన్స్ చేస్తున్నారట.ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అందుకే ఆయన పాత్రను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కొరటాల కోరాడట.దీనికి జక్కన్న ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చాడనేది సస్పెన్స్‌గా మారింది.

మొత్తానికి చరణ్ కోసం ఇద్దరు స్టార్ డైరెక్టర్‌లు ఇలా చర్చించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.అటు ఆర్ఆర్ఆర్‌లో చరణ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరి ఈ సినిమా రిలీజ్ కాకముందే చరణ్ ఆచార్యలో అడుగుపెడతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube