ఎన్టీఆర్‌కు జత కుదిర్చిన జక్కన్న  

Jr Ntr Heroine Revealed In Rrr Movie-emma Roberts,jr Ntr,ram Charan,rrr Movie,ఎన్టీఆర్‌కు,జక్కన్న

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌కు జోడీగా డైసీని ఎంపిక చేశారు. అయితే సినిమా ఆలస్యం అవ్వడంతో పాటు, ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి రావడంతో డైసీ సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. ఆమె వెళ్లి పోవడంతో కథను మార్చి ఇండియన్‌ హీరోయిన్‌ను పెట్టాలని జక్కన్న ఫిక్స్‌ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి..

ఎన్టీఆర్‌కు జత కుదిర్చిన జక్కన్న-Jr NTR Heroine Revealed In RRR Movie

ఆర్‌ఆర్‌ఆర్‌ తాజా షెడ్యూల్‌ ప్రారంభంకు అంతా సిద్దం అయ్యింది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌కు జోడీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. సినిమా కథానుసారంగా ఖచ్చితంగా ఎన్టీఆర్‌కు విదేశీ అమ్మాయి జోడీ అవ్వాల్సి ఉంది. అందుకే ఆ పాత్ర కోసం తాజాగా ఎమ్మా రాబర్ట్స్‌ అనే హాలీవుడ్‌ నటిని ఎంపిక చేయడం జరిగింది.

హాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈమెకు ఇండియాలో మాత్రం ఎక్కువగా గుర్తింపు రాలేదు..

రాజమౌళి సినిమాలో నటించేందుకు పెద్దగా గుర్తింపు అక్కర్లేదు. సినిమాలో నటిస్తే ఆటోమేటిక్‌గా గుర్తింపు వచ్చేస్తుంది.

ఈ సినిమాతో ఎమ్మా ఇండియాలో స్టార్‌ అవ్వడం ఖాయం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రికార్డు స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. వచ్చే ఏడాది జులై అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు..

అయితే కాస్త ఆలస్యంగా సినిమా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.