RRR సినిమాను పక్కన పెట్టిన రాజమౌళి.. ఆ హీరో కోసం వేటాడుతున్నాడట

ఆయన ఏ సినిమా తీసినా అదో పెద్ద సెన్సేషన్.ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీ రికార్డులను ఎప్పుడు బద్దలు కొడుతూ ఉంటాయి.

 Rajamouli Is In Search Of That Hero Mahesh Babu Kept Rrr Movie Aside-TeluguStop.com

ఇక ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నారు.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అని అనుకుంటున్నారా.

ఇంకెవరూ దర్శక ధీరుడు రాజమౌళి.దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి.

 Rajamouli Is In Search Of That Hero Mahesh Babu Kept Rrr Movie Aside-RRR సినిమాను పక్కన పెట్టిన రాజమౌళి.. ఆ హీరో కోసం వేటాడుతున్నాడట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే బాహుబలి సినిమా వరల్డ్వైడ్ హిట్ తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఇక అప్పటి నుంచి ఆయన చేసే ప్రతి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు  ఎదురుచూస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే బాహుబలి రికార్డ్స్ ను తలదన్నే విధంగా ఆర్ఆర్ఆర్ అనే ఒక భారీ ప్రాజెక్టును తెరకెక్కించాడు రాజమౌళి.ఈ సినిమా కోసం ఏకంగా ఒక్కరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు బరిలోకి దింపాడు.

ఇక ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ షూటింగ్ కూడా పూర్తి చేశాడు.అటు ప్రేక్షకుల నుంచి కూడా అంతకు మించి అనే రేంజ్ లోనే ఆదరణ వచ్చింది.

కానీ కరోనా వైరస్ కారణంగా విడుదల అవుతుంది అనుకొన్న త్రిబుల్ ఆర్ సినిమా కాస్త వాయిదా పడింది.దీంతో రాజమౌళి మళ్లీ నిరాశ లో మునిగిపోయారు.

అయితే రాజమౌళి ఒక సినిమా చేస్తున్న సమయంలో ఇంకో ప్రాజెక్టు గురించి అస్సలు ఆలోచించరు.అటు హీరోలను కూడా మరో సినిమా చేయడానికి అనుమతించరు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయి ఉంటే ఇక రాజమౌళి ఈ సక్సెస్ మేనియాలో మునిగి తేలుతూ ఉండేవారేమో.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా వాయిదా పడడంతో ఇక ఇప్పుడు మరో సినిమా కోసం రాజమౌళి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆలోచించకుండా మహేష్ బాబుతో సినిమా కోసం ప్రస్తుతం కసరత్తులు మొదలుపెట్టారట జక్కన్న.

దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఎన్ని రోజులనుంచి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందని టాక్ వినిపిస్తున్నప్పటికీ ఇక మిగతా సినిమాలు లైన్ లోకి రావడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వాయిదా పడుతూ వస్తుంది.కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా మరికొన్ని రోజులలో పట్టా లెక్కించడం పైనే రాజమౌళి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Rajamouli Is In Search Of That Hero Mahesh Babu Kept Rrr Movie Aside Details, Director Rajamouli, Rrr Movie, Super Star Mahesh Babu, Covid Effect , Tollywood, Ram Charan, Jr Ntr, Rajamouli Mahesh Babu Movie, Pan India Movie - Telugu Covid Effect, Rajamouli, Jr Ntr, Pan India, Rajamoulimahesh, Ram Charan, Rrr, Mahesh Babu, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube