ప్రభాస్ కు జక్కన్న ఝలక్.. మళ్లీ సినిమా తీయడంట..?  

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల వల్ల ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగింది.

TeluguStop.com - Rajamouli Interesting Comments On Working With Hero Prabhas

ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు తీస్తారని రాజమౌళికి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టిందని.మళ్లీ మా కాంబినేషన్ లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారని రాజమౌళి అన్నారు.అయితే రాజమౌళి సరదాగానే ఆ కామెంట్లు చేశారు.

TeluguStop.com - ప్రభాస్ కు జక్కన్న ఝలక్.. మళ్లీ సినిమా తీయడంట..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ కామెంట్లు చేసిన తరువాత రాజమౌళి నవ్వుతూ ప్రభాస్ తో సినిమా చేయాలని తనకు కూడా ఉందని సరైన కథ కుదిరితే మళ్లీ ప్రభాస్ తో ఖచ్చితంగా సినిమా తీస్తానని చెప్పారు.

Telugu Bahubali 2, Interesting Comments, Prabhas Rajamouli, Rrr Movie-Latest News - Telugu

అయితే ఇప్పట్లో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.అటు ప్రభాస్, ఇటు రాజమౌళి వరుస సినిమా కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు.బాహుబలి సిరీస్ వల్ల వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

బాహుబలి సిరీస్ వల్ల ప్రభాస్, రాజమౌళి ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లను రాజమౌళి ఇప్పటికే షూట్ చేశారు.

వచ్చే ఏడాది దసరా పండుగ నాటికి ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారని సమాచారం.ఏప్రిల్ నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవుతుందని ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం నాలుగైదు నెలల సమయం పడుతుందని సమాచారం.

#Bahubali 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు